బాదం పప్పులు, సొంప్ మరియు పటిక బెల్లం సమాన మోతాదులో తీసుకోవాలి.
- పటిక బెల్లంను పొడి చేసుకోవాలి.
- కొంచెం ఆవు నెయ్యి వేసి సొంప్ ని లైట్ గా ఫ్రై చేయాలి. చల్లారాక దీన్ని కూడా పొడి చేయాలి.
- బాదం పప్పులని కొన్ని గంటలు వేడి నీటిలో నానవేసి, పైన తొక్కు తీసి తరువాత పైన తొక్కు తీసి ఎండలో ఎండబెట్టాలి. ఆ తరువాత వీటిని కూడా పొడి చేయాలి.
- ఈ మూడు పొదులను బాగా కలిపి ఒక తడి లేని గాజు సీసా లో స్టోర్ చేసుకోవాలి.
ఉపయోగించే విధానం:
1 స్పూన్ చొప్పున అర గ్లాస్ పాలలో కలిపి రోజూ పడుకోబోయే ముందు తాగాలి.
ఉపయోగాలు:
కంటి చూపు మెరుగు అవుతుంది. జ్ణాపక శక్తి , ఏకాగ్రత పెరుగుతాయి.
Sunday, July 17, 2011
Stomachache in Children - పిల్లల్లో కడుపు నొప్పి తగ్గడానికీ
- కొంచెం ఇంగువ తీసుకొని నీరు కలిపి పలుచని పేస్ట్ లాగా చేసుకోవాలి. పిల్ల లేదా పిల్లవాడి బొడ్డు చుట్టూ ఈ పేస్ట్ ని అప్లై చేయాలి. ఇలా చేస్తే పిల్లల్లో గ్యాస్ వల్ల కలిగే కడుపు నొప్పి తగ్గుతుంది.
- ఒక టీ స్పూన్ ఎండబెట్టిన ధనియాలు, చిన్న అల్లం ముక్క నీటిలో కలిపి బాగా మరగబెట్టాలి. ఆ తరువాత దీన్ని వడబోసి పిల్లలకి కొంచెం కొంచెం పట్టాలి.
Sinus Problem
దాల్చిన చెక్క , లవంగాలు, జాపత్రి, పసుపు రోస్ట్ చేసి పౌడర్ చేసుకోవాలి. దీన్ని బెల్లం తో కలిపి చిన్న చిన్న గోళీలుగా చేసుకొని తడి లేని పొడి సీసా లో భద్రపరచుకోవాలి. రోజుకోక గోళీ తీసుకుంటూ ఉంటే సైనస్ ప్రాబ్లమ్ తగ్గుముఖం పడుతుంది.
ఈ గోళీలు ఆరు నెలల వరకు పాడు అవకుండా ఉంటాయి.
ఈ గోళీలు ఆరు నెలల వరకు పాడు అవకుండా ఉంటాయి.
ప్రసవానంతరం పొట్ట తగ్గించడానికి విధ్వంసన కల్పం
ఇంగువ - చిటికెడు తేనె - 5గ్రా వెల్లుల్లి ముద్ద - 1గ్రా
తయారీ:
ఒక గిన్నెలో 5గ్రా అనగా 1 టీ స్పూన్ తేనె తీసుకొని చిటికెడు ఇంగువ పొడి, 1గ్రా వెల్లుల్లి ముద్ద వేసి అన్నీ బాగా కలిపి ఉదయం, సాయంత్రం తీసుకోవాలి.
అదనపు జాగ్రతలు:
బాగా రెస్ట్ తీసుకోవాలి. లైట్ గా ఎక్సర్సైస్ చేయాలి. బాగా నీరు తాగాలి.
తయారీ:
ఒక గిన్నెలో 5గ్రా అనగా 1 టీ స్పూన్ తేనె తీసుకొని చిటికెడు ఇంగువ పొడి, 1గ్రా వెల్లుల్లి ముద్ద వేసి అన్నీ బాగా కలిపి ఉదయం, సాయంత్రం తీసుకోవాలి.
అదనపు జాగ్రతలు:
బాగా రెస్ట్ తీసుకోవాలి. లైట్ గా ఎక్సర్సైస్ చేయాలి. బాగా నీరు తాగాలి.
దీర్ఘ కాల తలనొప్పికి - ఏపెల్ పండు
మేలురకమైన కొబ్బరి ముక్కలా గట్టిగా ఉండే ఏపెల్ పండుని తీసుకొని పై తోలు తీసివేసి ముక్కలు గా కోసి ముక్కల లోపల గట్టిగా ఉండే భాగాన్ని కూడా తీసివేసి మిగతా భాగాన్ని ముక్కలుగా చేసుకొని ఒక్కొక్క ముక్కకు కొద్దిగా ఉప్పు అద్ది తినాలి.
ఇలా రోజూ ఉదయం పరగడుపున తింటూ ఉంటే ఎంతో కాలం నుండి వేధిస్తున్న తలనొప్పులు ఒకటి లేదా రెండు వారాల్లో పూర్తిగా తగ్గిపోతాయి.
ఇది తిన్న తరువాత గంట వరకూ ఏమీ తినకూడదు, తాగకూడదు.
ఇలా రోజూ ఉదయం పరగడుపున తింటూ ఉంటే ఎంతో కాలం నుండి వేధిస్తున్న తలనొప్పులు ఒకటి లేదా రెండు వారాల్లో పూర్తిగా తగ్గిపోతాయి.
ఇది తిన్న తరువాత గంట వరకూ ఏమీ తినకూడదు, తాగకూడదు.
అందం మరియు ఆరోగ్యం ప్రసాదించే ఔషధం
బాదం పప్పులు 10, చిన్న ఏలకులు 2, ఎండు కర్జూరాలు 2 తీసుకొని వీటిని ఒక మట్టి పాత్ర లో వేసి మునిగే వరకు నీటిని పోసి మూత పెట్టి రాత్రంతా నానబెట్టాలి. ఉదయం నీటిని తీసివేసి బాదం పై పొట్టుని, ఏలకుల పై పొట్టుని మరియు ఖర్జూరంలోని విత్తనాలను తీసివేసి మిగిలిన పధార్ధాలను మెత్తగా నూరి అందులో తాజా వెన్న 25గ్రా, చక్కెర 30గ్రా కలిపితే మంచి ఆహార ఔషధం తయారు అవుతుంది.
ఉపయోగించు విధానం:
రోజూ ఉదయం అల్పాహారం పేరుతో ఐడ్లీ దోస బదులు ఈ ఔషదం తయారు చేసుకొని తింటే సర్వంగాలు గట్టి పడి మంచి సౌందర్యం సొంతం అవుతుంది.
ఉపయోగించు విధానం:
రోజూ ఉదయం అల్పాహారం పేరుతో ఐడ్లీ దోస బదులు ఈ ఔషదం తయారు చేసుకొని తింటే సర్వంగాలు గట్టి పడి మంచి సౌందర్యం సొంతం అవుతుంది.
అణువణువూ శక్తినిచ్చే ఆహార ఔషధం
ఐదు నుండి పది వరకు బాదం పప్పులను తీసుకొని ఒక మట్టి పాత్రలో వేసి మునిగే వరకు నీళ్ళు పోసి ఉదయం వరకు నానబెట్టాలి. ఉదయం నీళ్ళు తీసేసి ఆ పప్పుల పైన తోలు తీసివేసి ఆ పప్పులను వెన్న లాగా నూరి ఆ గుజ్జుని ఒక గ్లాసు పాలలో కలిపి మూడు పొంగులు వచ్చే వరకు మరిగించి దించి చల్లార్చి తరువాత ఒకటి లేదా రెండు చెంచాల పట్టు తేనె కలిపితే మంచి ఆహార ఓషధం తయారు అవుతుంది.
ఈ పాలను ఉదయం పరగడుపున లేదా సాయంత్రం లేదా రాత్రి ఆహారం తరువాత రెండు గంటలు ఆగి పడుకునేముందు కానీ తాగుతూ ఉండాలి.
ఉపయోగాలు:
శరీరం లో అణువణువూ శక్తి వంతం అవుతుంది.
Subscribe to:
Posts (Atom)